శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 నవంబరు 2019 (18:11 IST)

కార్తీక మాసం - బిల్వపత్రం

శివుని దేవాలయాల్లో బిల్వపత్రం లేకుండా పూజ చేయరు. బిల్వపత్రంతో ఈశ్వరుడుని అయినా విష్ణువును అయినా లేదా దుర్గాదేవిని పూజచేస్తే వారికి జీవితంలో వచ్చే శనైశ్చర, అష్టమ శనైశ్చర దోషాలు తొలగి తత్వజ్ఞానంలో మనసు లీనం అవుతుంది. అన్ని కష్టాలు నివారించబడతాయి.  
 
ఏలినాటి శనిదోషమున్నవారు శివునికి బిల్వ పత్రంతో స్తుతించి పూజిస్తే వారికి మూడు జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి. బిల్వపత్రాలతో దేవికి అష్టోత్తరం లేదా పూజలను చేస్తే వారి ఇష్టార్థం నెరవేరుతుంది. బిల్వ వృక్షానికి ప్రతీ రోజు పన్నీరు వేసి ఆ చెట్టును పెంచితే వారికి దారిద్ర్యం, దుఃఖం అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. 
 
బిల్వపత్రంతో శ్రీ మహాలక్ష్మికి పూజలు చేసి ప్రసాదం స్వీకరిస్తే వారికి దారిద్ర్యం రాదు. వైభవలక్ష్మికి బిల్వపత్రంతో పూజచేసి సుమంగుళులకు బ్రాహ్మణులకు తాంబూలంలో పాటు బిల్వ దళాలను దానం చేస్తే ఇంట్లో రుణ బాధ, రోగ బాధ, నిత్య దారిద్ర్యం తొలగిపోతుంది. కాబట్టే బిల్వపత్రం అన్ని పత్రాల్లో శ్రేష్టమైనది, పూజల్లో చాలా పవిత్రమైనదని చెప్పబడింది.