గురువారం పూట ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే?
గురువారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా అనేక శుభ ఫలితాలను పొందవచ్చు. భక్త ఆంజనేయుడైన హనుమాన్ మహిమల గురించి పలు పురాణాల్లో చెప్పబడివుంది. ఇందుకు కారణం వైష్ణవంలో రామ భక్తుడిగా, శైవంలో శివుడి అంశగా హనుమంతుడు వుండటమే. హనుమంతుడిని పూజించడం ద్వారా జ్ఞానం, బలం, ధైర్యం లభిస్తాయి.
''రామ'' అనే చోట రామ భక్తుడైన ఆంజనేయుడు వుంటాడని విశ్వాసం. అందుకే రామ నామ భజనతో, సింధూర పువ్వుల పూజతో, తమలపాకుల అర్చనతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అదీ గురువారం హనుమంతుడిని తమలపాకులు, సింధూరంతో అర్చిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి.
ఇంకా తులసీ ఆకుల మాలను ఆయనకు సమర్పించుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే గురువారం పూట హనుమంతునికి వడమాల, తలపాకుల మాల, వెన్నతో అర్చించిన వారికి కుటుంబంలో సంతోషాలు ప్రాప్తిస్తాయి. చేపట్టిన కార్యం విజయవంతం అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ఇంకా శనివారం ఆంజనేయునికి వ్రతమాచరిస్తే సకల భోగభాగ్యాలు చేకూరుతాయి. ఆ రోజున ఒక పూట భోజనం చేయాలి. శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని అటుకులు, కలకండ, అరటి పండ్లు స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తే, నేతితో దీపమెలిగిస్తే సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.