గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 2 ఆగస్టు 2019 (22:10 IST)

శనివారం నాడు హనుమంతుని పూజిస్తే...?

హనుమంతుడు గంధమాదన పర్వతంపై తపోదీక్షలో ఉన్న సమయంలో శనిదేవుడు వచ్చి పీడించబోయాడు. హనుమంతుడు అతనిని ముప్పుతిప్పలు పెడతాడు. శని దేవుడు ఆ బాధలు భరించలేక చివరకు ఆంజనేయ స్వామినే శరణు వేడతాడు. అప్పుడు హనుమంతుడు శనిదేవుడిని క్షమించి, అందుకు తన శరీరానికి నువ్వుల నూనెతో కలిపిన సింధూరాన్ని పూసి, తమలపాకులతో పూజించి, అరటిపళ్లు నివేదిస్తే బాధ నివారణ అవుతుందని చెప్తారు.
 
శని దేవుడు అలా చేసి బాధా విముక్తుడయ్యాడు. అప్పుడు హనుమంతుడు ఎవరైనా నా భక్తులు శనివారంనాడు ఆ విధంగా నన్ను పూజించిన నాడు వారి జోలికి వెళ్ళొద్దని శనిదేవునికి చెప్పడం వలన శని హనుమంతుని భక్తుల జోలికి రాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే మంగళవారం నాడు హనుమంతుని పూజిస్తే సకల దోషాల నుండి విముక్తి లభిస్తుంది.
 
ఆయువును, ఐశ్వర్యాన్ని పొందుతారు. భూత, ప్రత, పిశాచాల బాధ తొలగాలన్నా రోగాల బాధలు తొలగాలన్నా హనుమంతుని పూజిస్తే రక్షణ కలుగుతుంది.