సంబంధిత వార్తలు
- అర్జున్ రెడ్డి కాంబినేషన్లో సినిమా, ఇంతకీ ఎప్పుడు..?
- ఆ హీరో వద్ద చెమట కంపు.. విజయ్ దేవరకొండ అంటే పిచ్చి: రకుల్ ప్రీత్ సింగ్
- కొత్త లుక్‌తో అదరగొడుతున్న హీరో విజయ దేవరకొండ
- విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' లుక్‌ని పట్టించుకోని జనం... ప్లీజ్ హెల్ప్ అంటూ అడిగాడా?
- చరణ్ సినిమానే విజయ్ చేస్తున్నాడా..?
అసలే పూరీ సినిమా.. ఆపై విజయ్ దేవర కొండ.. ప్రియా ప్రకాష్ వారియర్ ఖుషీ (video)
విజయ్ దేవరకొండతో ఓవర్‌నైట్‌తో కన్నుగీటి స్టార్ అయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ జతకట్టనుంది. డియర్ కామ్రేడ్ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా మొదలుపెట్టాడు.
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్‌లో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. బాక్సింగ్ నేపథ్యంతో సాగే ఈ సినిమాకు టైటిల్‌గా ఫైటర్ అని పెట్టబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నుగీటి కుర్రాళ్ల హృదయాలను గెలిచిన ప్రియా ప్రకాశ్ నటిస్తుందని తెలుస్తుంది.
అసలే పూరి సినిమా ఆపైన విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోతో ఛాన్స్ రావడంతో ప్రియా ప్రకాశ్ ఎగిరి గంతేస్తోంది. తప్పకుండా ఈ మూవీ హిట్ అయితే మాత్రం ప్రియా ప్రకాశ్ రేంజ్ మారిపోయే అవకాశం ఉందని సినీ జనం చెప్పుకుంటున్నారు. విజయ్ సినిమాతో పాటుగా నితిన్, చంద్రశేఖర్ యేలేటి మూవీ ఛాన్స్ కూడా అందుకుంది ప్రియా ప్రకాశ్. మరి ఈ సినిమాల ద్వారా హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటో లేదో వేచి చూడాలి.
