గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (15:12 IST)

విజ‌య్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' లుక్‌ని పట్టించుకోని జనం... ప్లీజ్ హెల్ప్ అంటూ అడిగాడా?

యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా... త‌దిత‌ర చిత్రాల‌తో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ స్సీడుకు బ్రేక్ వేసిన సినిమా డియ‌ర్ కామ్రేడ్‌. 
 
ఈ సినిమాని తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేసారు. ఈ నాలుగు భాష‌ల్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో త‌దుప‌రి సినిమాని ఎలాగైనాస‌రే స‌క్స‌స్ చేయాల‌ని.. మ‌ళ్లీ స‌క్స‌స్ ట్రాక్ లోకి రావాల‌ని తెగ త‌ప‌న ప‌డుతున్నాడ‌ట‌. అందుక‌నే అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాని హెల్ప్ అడిగిన‌ట్టు స‌మాచారం. 
 
ఇంత‌కీ ఏంటా హెల్ప్ అంటే... విజ‌య్ నెక్ట్స్ మూవీ వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్ చిత్రానికి సంబంధించి సూచ‌న‌లు ఇవ్వాల‌ని కోరార‌ట‌. అందుకు సందీప్ రెడ్డి వంగా కూడా ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌కి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. దీంతో మ‌రింత కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. మ‌రి... సందీప్ స‌ల‌హాలు విజ‌య్‌కి విజ‌యాన్ని అందిస్తాయో లేదో చూడాలి.