శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఫ్రీతి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (13:30 IST)

ఆగిపోయిందనుకున్న రౌడీ బాయ్ మూవీ మళ్లీ సెట్స్‌పైకి...

చాలా తక్కువ వ్యవధిలోనే టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరోగా మారిన విజయ్‌ దేవరకొండకు సంబంధించిన సంచలన వార్త ఒకటి సినీవర్గాలలో చక్కర్లు కొడుతోంది. తాజా ఈ హీరోతో ప్లాన్‌ చేసిన ఓ భారీ చిత్రం మధ్యలో ఆగిపోయినట్టుగా గతంలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను తిరిగి సెట్స్‌ మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్‌. 
 
క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా, తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో హీరో అనే పేరుతో సినిమా షూటింగ్ ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ సినిమాలో విజయ్ బైక్‌ రేసర్‌గా నటిస్తున్నాడు. చాలా రోజుల క్రితం షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా కోసం ఇప్పటికే ఓ షెడ్యూల్‌‌ను కూడా పూర్తి చేశారు. బైక్ రేసింగ్ సీన్స్‌తో కూడిన ఈ షెడ్యూల్‌ను ఢిల్లీలో షూట్‌ చేసారు. ఈ సినిమా మరి ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి మరి.