ఏపీ పోస్టల్ శాఖలో 2707 ఖాళీలు.. పోస్టు మ్యాన్ కోసం నోటిఫికేషన్

సెల్వి| Last Updated: శుక్రవారం, 18 అక్టోబరు 2019 (19:30 IST)
ఏపీ పోస్టల్ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పోస్టల్ శాఖ ఆ నోటిఫికేషన్‌లో ప్రకటించింది.

ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రామీణ డాక్ సేవక్ (పోస్టుమ్యాన్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాలి. ఈ దరఖాస్తుల పూర్తికి వచ్చే నెల అంటే నవంబర్ 14, 2019 చివరి తేదీ

ఏపీ పోస్టల్ శాఖలో పోస్టు మ్యాన్ పోస్టులకు 2707 ఖాళీలున్నాయి.
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 14-11-2019
విద్యార్హతలు: 10వ తరగతి
వయస్సు: 18 నుంచి 40 ఏళ్లు
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 14-11-2019

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయని పోస్టల్ శాఖ ప్రకటించింది.దీనిపై మరింత చదవండి :