1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ram Charan review on Mahanati

''మహానటి''గా కీర్తి సురేష్ అదుర్స్.. రామ్ చరణ్

''మహానటి'' సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రముఖ తారలందరూ.. ప్రశంసల జల్లు కురిపించారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వ

Ram Charan
''మహానటి'' సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రముఖ తారలందరూ.. ప్రశంసల జల్లు కురిపించారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మహానటి సినిమాను చూసిన సినీ ప్రముఖులంతా యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. 
 
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి దర్శక నిర్మాతలను తన ఇంటికి ఆహ్వానించి సత్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ తనయుడు కూడా మహానటి సినిమాపై ప్రశంసలు కురిపించాడు. బిజీగా ఉండటం వలన కాస్త ఆలస్యంగా ఈ సినిమా చూసినట్లు చరణ్ చెప్పాడు. 
 
ఆపై సోషల్ మీడియాలో ''మహానటి'' సినిమాపై స్పందించాడు. తన మనసును మహానటి ఎమోషనల్‌గా టచ్ చేసింది. నాగ్ అశ్విన్ ఎంతో అంకితభావంతో ఈ సినిమాను రూపొందించాడు. సావిత్రిగా కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ పాత్రను ఆమె తప్ప వేరెవరూ ఇంతబాగా చేయలేరనిపించింది. సమంత, దుల్కర్, విజయ్ నటన సహజంగా వుందంటూ కితాబిచ్చాడు. ఇంత గొప్ప సినిమాను అందించిన నిర్మాతలకు చెర్రీ అభినందనలు తెలిపారు. 
About Writer
selvi
తర్వాతి కథనం
ఐస్‌క్రీమ్ అరగిస్తే ముక్కులో నుంచి పొగ వస్తుందా... ఈ వీడియో చూడండి..