మా ఆయన నాకోసం పూలు తెచ్చారు... మురిసిపోయిన ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అంటే ఆయన సతీమణి ఉపాసనకు ఎక్కడలేని ఇష్టం. అందుకే ఎపుడు సమయం, సందర్భం వస్తే చాలు.. తన భర్తను ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇందుకోసం ఆమె సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటుంది.

ram charan with flowers
pnr| Last Updated: మంగళవారం, 5 జూన్ 2018 (11:45 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అంటే ఆయన సతీమణి ఉపాసనకు ఎక్కడలేని ఇష్టం. అందుకే ఎపుడు సమయం, సందర్భం వస్తే చాలు.. తన భర్తను ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇందుకోసం ఆమె సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటుంది. తాజాగా తన భర్త మిస్టర్ సి పై పొగడ్తల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేసింది. మిస్టర్ సి తన కోసం పూల బొకేను కొని తెచ్చారంటూ మురిసిపోయింది.
 
దీనికి సంబంధించి షాపింగ్ చేసి వస్తున్న హీరో రామ్ చరణ్ ఫొటోను షేర్ చేసి, తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఉపాసన. ఈ చిత్రంలో చరణ్ కారులో ఎంతో జాగ్రత్తగా ఓ బొకేను పొదివి పట్టుకుని కూర్చున్నట్టు కనిపిస్తుండగా, ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు, భార్య పట్ల రామ్ చరణ్‌కు ఉన్న ప్రేమకు ఈ ఫొటో నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. 
 
కాగా, రామ్ చరణ్ ఎంతో అమాయకంగా, క్యూట్‌గా కనిపిస్తున్నారని, స్వచ్ఛమైన ప్రకృతికి సాక్ష్యంగా నిలిచే పూలు ఆయన చేతిలో క్షేమంగా ఉన్నాయని అంటున్నారు. ఈ పిక్ చూస్తుంటే అన్నయ్యకు ఉపాసనంటే ఎంత ఇష్టమో ఇట్టే తెలిసిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంమీద తన భర్త చేసిన పనికి భార్యగా మురిసిపోయింది. దీనిపై మరింత చదవండి :