గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 25 మే 2018 (14:31 IST)

బాబాయ్ అడిగితే... జ‌న‌సేన పార్టీకి ప్ర‌చారం చేస్తా - రామ్ చ‌ర‌ణ్‌..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు గుడ్ బై చెప్పి.. పూర్తిస్థాయి రాజ‌కీయ నాయకుడుగా మారిన విష‌యం తెలిసిందే. అయితే.. మెగా ఫ్యామిలీ నుంచి ఎవ‌రు కూడా జ‌న‌సేన పార్టీలో చేరుతున్న‌ట్టుగానీ.. ప్ర‌చారం చేస్తామ‌ని గానీ ఇప్ప‌టివ‌రకు చెప్ప‌లేదు. అయితే... జనసేన పార్టీ తర

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు గుడ్ బై చెప్పి.. పూర్తిస్థాయి రాజ‌కీయ నాయకుడుగా మారిన విష‌యం తెలిసిందే. అయితే.. మెగా ఫ్యామిలీ నుంచి ఎవ‌రు కూడా జ‌న‌సేన పార్టీలో చేరుతున్న‌ట్టుగానీ.. ప్ర‌చారం చేస్తామ‌ని గానీ ఇప్ప‌టివ‌రకు చెప్ప‌లేదు. అయితే... జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు తాను సిద్ధమని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటున్నాడు. బ్యాంకాక్ నుంచి తిరిగొచ్చిన రామ్ చరణ్‌ను హైదరాబాద్‌లో మీడియా పలకరించింది.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్‌ కష్టపడుతుండటం చూస్తుంటే బాధగానే ఉంది కానీ, ప్రజల కోసం పర్యటిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
 
ప్రజలు ఎంతగా బాధపడుతున్నారనే విషయాన్ని ఆయన గుర్తించారు. ప్రజల బాగు కోసం ఆయన వెళుతున్నారు కనుక మనం ప్రోత్సహించాలే తప్ప బాధపడకూడదు అన్నారు. మ‌రి.. ప‌వ‌న్ అబ్బాయ్ చ‌ర‌ణ్‌ని ప్ర‌చారం చేయ‌మంటారో లేదో చూడాలి..!