శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 24 మే 2018 (13:19 IST)

పవన్ అలా సెట్ చేశాడట.. సైరా తర్వాత మెగాస్టార్‌తో కొరటాల సినిమా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక హిట్ దర్శకుడు కొరటాల శివ సినిమా చేసేందుకు రెడీగా వున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. శ్రీమంతు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక హిట్ దర్శకుడు కొరటాల శివ సినిమా చేసేందుకు రెడీగా వున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. శ్రీమంతుడు, మిర్చి, భరత్ అనే నేను సినిమాలతో హిట్ కొట్టిన కొరటాల ఈసారి మెగాస్టార్‌తో సినిమా చేయాలనుకుంటున్నారని తెలిసింది. అయితే ఈ కాంబినేషన్‌ను సెట్ చేసింది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిసిన కొరటాల ఓ సందేశాత్మక కథను వినిపించారట. అయితే పవన్ కల్యాణ్ ఈ చిత్రాన్ని అన్నయ్య చిరంజీవితో చేస్తే బాగుంటుందని.. ప్రస్తుతానికి తాను రాజకీయాలతో బిజీ బిజీగా వున్నానని చెప్పారట. దీంతో ఆ కథను మెగాస్టార్ వద్ద చెప్పేందుకు కొరటాల వెళ్ళడం.. ఆ కథను విన్న చిరంజీవి.. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. అలా పవన్ కల్యాణ్ కొరటాలతో చిరంజీవి సినిమా చేసేందుకు కారణమైనట్లు సినీ వర్గాల సమాచారం. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని టాక్.