మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 మే 2018 (17:55 IST)

ఏడు దశాబ్దాల సమస్య.. 48 గంటల్లో పరిష్కారమవుతుందా? : పవన్‌కు లోకేశ్ కౌంటర్

మేషం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బంధువులను కలుసుకుంటారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. పాత వస్తువులను కొని ఇ

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించని పక్షంలో నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సమస్య పరిష్కారం కోసం 48 గంటల డెడ్‌లైన్ విధించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
 
ఉద్దానం సమస్యపై పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. తప్పుడు సమాచారంతో పవన్‌ను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కిడ్నీ సమస్య ఉన్న పలాస, వజ్రపుకొత్తూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, మందసలో సుమారు 16 కోట్ల రూపాయలతో సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. 
 
ఇప్పటికే 109 రిమోట్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేశామని, ఈ నెలాఖరులోగా మరో 27 యూనిట్స్‌ పూర్తి కాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు లక్షమందికి స్క్రీనింగ్‌ చేశామన్న లోకేశ్ కిడ్నీ బాధితులకు డయాలిసిస్‌తోపాటు నెలకు 2500 పింఛన్ ఇస్తున్నట్టు తెలిపాు. అలాగే సోంపేటలో కొత్త ల్యాబ్‌, పలాస, సోంపేట, పాలకొండలో డయాలసిస్‌ సర్వీస్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ట్వీట్‌లో వివరించారు. 
 
ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఒకటుందన్నారు. 70 యేళ్లుగా పరిష్కారం కాని సమస్య ఉన్నఫళంగా కేవలం 48 గంటల్లో పరిష్కరించడం సాధ్యపడుతుందా? అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. అందువల్ల ఉద్దానం సమస్యను ఖచ్చితంగా పరిష్కరించి తీరుతామని ఆయన చెప్పారు.