ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: గురువారం, 31 మే 2018 (17:12 IST)

పెళ్లి సంద‌డిలో చ‌ర‌ణ్ - ఉపాస‌న.. పెళ్లి ఎవ‌రిదో తెలుసా?

రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు ప్ర‌స్తుతం ఫ్రాన్స్‌లో ఉన్నారు. ఓ పెళ్లిలో సంద‌డి చేసేందుకు అక్క‌డికి వెళ్లారు. జీవీకే, అపోలో ఫ్యామిలీకి సంబంధించిన ఈ వివాహ వేడుకలు ఘనంగా జరిగినట్టు సమాచారం. ఇంత‌కీ పెళ్లి ఎవ‌ర‌ది అనుకుంటున్నారా..? శ్రియా భూపాల్‌ది. శ్రి

రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు ప్ర‌స్తుతం ఫ్రాన్స్‌లో ఉన్నారు. ఓ పెళ్లిలో సంద‌డి చేసేందుకు అక్క‌డికి వెళ్లారు. జీవీకే, అపోలో ఫ్యామిలీకి సంబంధించిన ఈ వివాహ వేడుకలు ఘనంగా జరిగినట్టు సమాచారం. ఇంత‌కీ పెళ్లి ఎవ‌ర‌ది అనుకుంటున్నారా..? శ్రియా భూపాల్‌ది. శ్రియా భూపాల్‌ ఈ పేరు గుర్తుండే ఉంటుంది అందరికి. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె... అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్‌ మిస్‌ అయిన విషయం తెలిసిందే.
 
అఖిల్, శ్రియా భూపాల్‌కు నిశ్చితార్థం జ‌రిగిన తర్వాత చివరి నిమిషంలో వారిద్దరి పెళ్లి ర‌ద్దవ్వడం అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయింది. పెళ్లి క్యాన్సిల్‌పై ఇటు నాగార్జున కుటుంబం కానీ, అటు జీవీకే కుటుంబం కానీ పెద్దగా స్పందించలేదు. ఈ సంఘటన తరువాత శ్రియా భూపాల్‌ వివాహం హీరో రాం చరణ్‌ భార్య ఉపాసన కజిన్‌తో నిశ్చయించారు. 
 
తాజాగా ఈ పెళ్లి ప్యారిస్‌ సమీపంలోని ఓ సిటీలో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి​కి రాంచరణ్‌, ఉపాసన హాజరయ్యారు. వీరిద్దరు అక్కడ దిగిన ఫోటోను ఉపాసన తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదీ..సంగ‌తి!