మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 3 జూన్ 2018 (11:03 IST)

మహానటి జీవిత కథకు నా కథకు పోలికలున్నాయ్: సమంత

దక్షిణాది హీరోయిన్.. సక్సెస్ స్టార్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లయ్యాక కూడా వరుస హిట్లు కొడుతూ దూసుకెళ్తున్న సమంత ఓ ఇంటర్వ్యూలో ''మహానటి'' సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని

దక్షిణాది హీరోయిన్.. సక్సెస్ స్టార్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లయ్యాక కూడా వరుస హిట్లు కొడుతూ దూసుకెళ్తున్న సమంత ఓ ఇంటర్వ్యూలో ''మహానటి'' సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. సావిత్రి జీవిత కథ తెలుసుకుంటుంటే.. అది తన కథలాగానే అనిపించిందని సమంత చెప్పింది. 
 
ప్రేమ విషయంలో సావిత్రిలానే తాను నమ్మానని.. కానీ అదృష్టం కొద్ది తృటిలో తప్పించుకున్నానని.. లేకుంటే తన కథ కూడా సావిత్రిలానే అయ్యుండేదని చెప్పింది. ఆ బాధ నుంచి త్వరలోనే బయటపడ్డానని.. తాను చేసుకున్న పుణ్యం, అదృష్టం వల్లే చైతూ దొరికాడని అనిపిస్తోందని సమంత వెల్లడించింది. 
 
ఇంకా మహానటి సావిత్రి జీవిత కథకు తన కథకు కొన్ని పోలికలున్నట్లు సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు పెళ్లైనా.. సినిమాల్లో రొమాన్స్ పండించేందుకు సిద్ధంగా వున్నట్లు సమంత ప్రకటించింది. 
 
హీరో ఎవరైనా.. తెరపై రొమాన్స్ కూడా నటనేనని చెప్పుకొచ్చింది. కానీ తాను చేసే పాత్రలు హుందాగా ఉండేలా చూసుకుంటానని చెప్పింది. ఇకపై తాను నటించే ప్రతి సినిమాకూ తానే డబ్బింగ్ చెప్పుకుంటానని సమంత స్పష్టం చేసింది.