"మహానటి" మూవీ నుంచి తొలగించిన వీడియో
సీనియర్ నటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'మహానటి'. మే 9న విడుదలైన ఈ చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ మనసులు గెలుచుకుంది. తెలుగు, తమిళ భాష
సీనియర్ నటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'మహానటి'. మే 9న విడుదలైన ఈ చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ మనసులు గెలుచుకుంది. తెలుగు, తమిళ భాషలలో విడుదలైన ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మూవీ మేకర్స్.
ఇప్పటికి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబడుతున్న ఈ చిత్రం రూ.30 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టింది. యూఎస్‌లోనూ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే నిడివి ఎక్కువైన కారణంగా తొలగించిన కొన్ని సీన్స్‌ని మధ్య మధ్యలో యూట్యూబ్ ద్వారా విడుదల చేస్తూ ప్రేక్షకులని ఆనందపరుస్తున్నారు.
తాజాగా 'రావోయి మా ఇంటికి' అనే సాంగ్‌కి సంబంధించిన వీడియోని విడుదల చేశారు. ఇందులో కీర్తి సురేష్ అభినయం అచ్చం సావిత్రిలానే ఉండటంతో ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా నుండి తొలగించిన సీన్స్ అంటూ విడుదలైన కొన్ని క్లిప్స్ సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి. మంచి సీన్లని ఎందుకు తొలగించారంటూ కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి చిత్రం వైజయంతి మూవీస్ బేనర్‌పై ప్రియాంక దత్, స్వప్నా దత్ నిర్మాణంలో రూపొందింది.