శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Updated : ఆదివారం, 27 మే 2018 (16:38 IST)

చైతు స‌వాలుకు సై అంటోన్న‌ సామ్..!

చై (చైతు) స‌వాలుకు సై అంటోన్న సామ్ (సమంత)...ఏంటి.? ఇంత‌కీ చై ఏమ‌ని స‌వాలు విసిరాడు...? అనుకుంటున్నారా..? ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఫిట్‌నెస్ ఛాలెంజ్ వైర‌ల్‌గా ట్రెండ్ అవుతోంది.

చై (చైతు) స‌వాలుకు సై అంటోన్న సామ్ (సమంత)...ఏంటి.? ఇంత‌కీ చై ఏమ‌ని స‌వాలు విసిరాడు...? అనుకుంటున్నారా..? ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఫిట్‌నెస్ ఛాలెంజ్ వైర‌ల్‌గా ట్రెండ్ అవుతోంది. ఒలింపిక్ ప‌త‌క విజేత రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ హ‌మ్ ఫిట్‌తో ఇండియా ఫిట్‌ ఛాలెంజ్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌ర‌కు వెళ్లి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
 
తాజాగా ఈ చాలెంజ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య వ‌ర‌కు వ‌చ్చింది. నాగ‌చైత‌న్యకు అఖిల్ స‌వాల్ విసిరాడు. దీంతో నాగ‌చైత‌న్య కూడా త‌ను వ‌ర్క‌వుట్ చేస్తున్న ఓ వీడియోను రూపొందించి మ‌రో ముగ్గుర్ని ఈ స‌వాలుకు నామినేట్ చేశాడు. 
 
భార్య స‌మంత‌, సుశాంత్, హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌ల‌ను చైత‌న్య నామినేట్ చేశాడు. ఈ ఛాలెంజ్‌కు స‌మంత స్పందించింది. 'హ‌మ్ ఫిట్‌తో ఇండియా ఫిట్‌' ఛాలెంజ్ నాకు చాలా బాగా న‌చ్చింది. మ‌న‌సుకు, ముఖ్యంగా క‌ళ్ల‌కు చాలా తేలిక‌గా అనిపిస్తోంది. చైతన్యా.. నేను నీ స‌వాలును స్వీక‌రిస్తున్నా. అయితే నువ్వు పోస్ట్ చేసిన వీడియో చూసి అలసిపోయాను. కాబట్టి నా ఛాలెంజ్‌ను రేపు పూర్తి చేస్తానంటూ స‌మంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. అదీ.. సంగ‌తి..!