శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (16:49 IST)

బీచ్‌లో చీరలు ధరించగలమా? నేను ఎలా వుండాలో నాకు తెలుసు: సమంత

బీచ్‌లో అటువంటి దుస్తుల్లో ఫొటోలను విడుదల చేస్తే విమర్శలు వస్తాయని తనకు బాగా తెలుసునని చెప్పింది. అయితే, బీచ్‌లో చీరలు ధరించగలమా? అని సమంత ప్రశ్నించింది. తనకు వివాహమైందని, అటువంటి పనులు చేయకూడదని కొంద

బోల్డ్‌గా మాట్లాడే హీరోయిన్లలో ముందుండే హీరోయిన్ రాధికా ఆప్టే. ఆమె గతంలో తన భర్తతో కలిసి గోవాకు ట్రిప్పేసింది. ఆ సందర్భంగా బికినీలో బీచ్‌లో తన భర్తతో వున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ ఫోటోలపై నెటిజన్లు మండిపడ్డారు. ఇందుకు రాధికా ఆప్టే ఘాటుగా స్పందించింది.


బీచ్‌లో చీరకట్టుకుని తిరగాలా అంటూ షాకిచ్చే బదులిచ్చింది. ఇదే తరహాలో పెళ్లైన తర్వాత సమంత కూడా స్పందించింది. భర్తతో బీచ్‌లో గడుపుతూ పోస్ట్ చేసిన ఓ హాట్ ఫోటోపై విమర్శలు వచ్చాయి.
 
తాజాగా ఆ విషయంపై సమంత స్పందించింది. బీచ్‌లో అటువంటి దుస్తుల్లో ఫొటోలను విడుదల చేస్తే విమర్శలు వస్తాయని తనకు బాగా తెలుసునని చెప్పింది. అయితే, బీచ్‌లో చీరలు ధరించగలమా? అని సమంత ప్రశ్నించింది. తనకు వివాహమైందని, అటువంటి పనులు చేయకూడదని కొందరు విమర్శిస్తున్నారని, తన జీవితాన్ని ఎలా గడపాలన్నది, తాను ఎలా వుండాలన్నది తనకు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 
 
తాను ఎవ్వరికీ భయపడనని.. అలాగని ఎలాంటి సమస్యల్లోనూ చిక్కుకోవాలని కోరుకోవట్లేదని సమంత చెప్పుకొచ్చింది. తాను తన భర్త నాగచైతన్యతో ఒక్కోసారి గొడవ పడతానని, తమ గొడవలు పక్కనున్న వారికి కూడా తెలియవంది. నిశ్శబ్దంగా గొడవ పడుతుండడాన్ని ఎవరైనా చూస్తే ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నామని అనుకుంటారని నవ్వుతూ చెప్పింది.
 
సినిమాల గురించి మాట్లాడుతూ.. సినిమాలకు తాను డబ్బులు పెట్టి చేయకపోవచ్చు. అయితే ప్రాణం పెట్టి పనిచేస్తానని.. సమంత తెలిపింది. ప్రస్తుతం తన టైమ్ బాగుందని.. అన్నీ సక్సెస్‌ అవుతున్నాయని సమంత చెప్పింది. రంగస్థలం, మహానటి ద్వారా మంచి పేరొచ్చిందని చెప్పింది. అనూహ్యమైన పాత్రలు తనను వెతుక్కుంటూ రావడం తన అదృష్టమని వెల్లడించింది. 
 
అదృష్టం, కాలం కలిసొచ్చిందని.. తన దర్శకుల ప్రతిభను తక్కువగా అంచనా వేయొద్దని చెప్పింది. వాళ్ల ఆలోచనకు దగ్గరగా వెళ్లాలని తనవంతు ప్రయత్నం చేస్తానని.. ఈ క్రమంలోనే ''రంగస్థలం'' చిత్రానికి శారీరకంగా చాలా శ్రమించానని సమ్మూ చెప్పింది. అలాగే  ''మహానటి''కి మానసికంగా కష్టపడ్డా. కొత్త విషయాలు నేర్పే ఈ జర్నీ బాగుందని సమంత తెలిపింది.