మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 26 మే 2018 (13:37 IST)

ఆ సినిమాలో వెంకీ సరసన నయనతార.. చైతూకు జోడీగా రకుల్..?

దర్శకుడు బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య కథానాయకులుగా భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియను మొ

దర్శకుడు బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య కథానాయకులుగా భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. ఈ క్రమంలో ముందుగా కథానాయికల ఎంపికను పూర్తి చేశారు. ఇందులో భాగంగా వెంకటేశ్ సరసన నయనతారను, చైతూ జోడిగా రకుల్‌ ప్రీత్ సింగ్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 
 
గతంలో వెంకటేశ్-నయనతార కాంబినేషన్లో వచ్చిన లక్ష్మి, తులసి, బాబు బంగారం సినిమాలు హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ జోడీకి మంచి క్రేజ్ ఉండటంతో కథానాయికగా నయనతారను సంప్రదించారట. త్వరలోనే ఈ సినిమాకు నయన గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది. 
 
అలాగే రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో చైతూ జోడీగా రకుల్ అదరగొట్టింది. అదే క్రేజ్‌తో రెండోసారి చైతూతో ఆమె జోడీ కట్టనుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.