రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ సన్నాహాలు
Gamechenger teaser poster
నవంబర్ 9న లక్నోలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌కు భారీ సన్నాహాలు చేయటం విశేషం. 11 చోట్ల (హైదరాబాద్-సుదర్శన్, వైజాగ్- సంగం శరత్, రాజమండ్రి-శివ జ్యోతి, విజయవాడ-శైలజ, కర్నూల్- వి మెగా, నెల్లూర్-ఎస్2 థియేటర్, బెంగళూర్- ఊర్వశి థియేటర్, అనంతపూర్-త్రివేణి, తిరుపతి-పి.జి.ఆర్, ఖమ్మం-ఎస్వీసీ శ్రీతిరుమల) టీజర్‌ను అభిమానుల సమక్షంలో విడుదల చేస్తుండటం విశేషం.
ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, జరగండి జరగండి.. , రా మచ్చా రా.. సాంగ్స్‌కు ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ దక్కింది. ఈ నెల 9న టీజర్ రిలీజ్ కానుంది. దీనిపై అంచనాలు నెక్ట్స్ రేంజ్లో ఉన్నాయి. అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

