మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (15:25 IST)

మా ఇంటి హెడ్మాస్టర్ మెగాస్టార్ చిరంజీవి : వరుణ్ తేజ్

Varun Tej
మెగా ఫ్యామిలీకి హెడ్మాస్టర్ చిరంజీవి అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడంలో చిరంజీవి కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. ప్రతి ఆదివారం మీటింగ్లు పెట్టి అందరినీ ఒక్కటి చేస్తారని చెప్పారు. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం "మట్కా". ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో వరుణ్ తేజ్ బిజీగా ఉన్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 
 
పెదనాన్న (చిరంజీవి) నిర్వహించే సంక్రాంతి వేడుకలో మాత్రం ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ మొత్తం కలుస్తాం. ప్రతి సంవత్సరం చిరంజీవి ఈ పండగను ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఆ నాలుగు రోజులు అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడు కలిసినా చిన్ననాటి విషయాలన్నీ గుర్తుచేసుకుంటాం. మా చిన్నతనంలో పెదనాన్న ప్రతి ఆదివారం మీటింగ్ పెట్టేవారు. కుటుంబమంతా ఐక్యంగా ఉండడానికి అలాంటి మీటింగులు ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పారు. 
 
మేమెంత ఎదిగినా చిరంజీవి మాత్రం మమ్మల్ని ఒకేలా చూస్తారు. ఆయన మమ్మల్ని ఎప్పుడూ ఆకతాయిలుగా మారనివ్వరు. మేము ఒదిగి ఉండడంలో కీలకపాత్ర పోషిస్తారు. మమ్మల్ని హద్దుల్లో ఉంచుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మా కుటుంబంలో హెడ్మాస్టర్ లాంటి వ్యక్తి. మా అందరికీ స్ఫూర్తి. చిన్నప్పుడు నాకు, రామ్ చరణ్‌కు, అల్లు అర్జున్‌కు ముగ్గురికీ ఆయన చేతుల్లో దెబ్బలు పడ్డాయి అని చెప్పారు.