మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (19:31 IST)

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

Adithya ram, Dkl Raju
Adithya ram, Dkl Raju
రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10, 2025న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ ల‌క్నోలో 9న మూవీ టీజ‌ర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ సిటీలో ఇంత గ్రాండ్‌గా టీజ‌ర్ రిలీజ్ చేస్తోన్న తొలి పాన్ ఇండియా స్టార్ రామ్ చ‌ర‌ణ్ కావ‌టం విశేషం.
 
కాగా, నేడు చెన్నైలో సినిమా విశేషాలు తెలియజేస్తూ దిల్ రాజు మాట్లాడుతూ, మూడేళ్ళ నాడు శంకర్ గారు కథ చెప్పగానే చేయాలని వెంటనే అనుకున్నాం. లక్నోలో 9న  యు.ఎస్., తర్వాత మరలా చెన్నై, తర్వాత ఎ.పి., తెలంగాణాలో  టీజర్ రిలీజ్ ఫంక్షన్ లు చేస్తాం. గేమ్ ఛేంజర్ సినిమా శంకర్ దర్శకత్వంలో రాబోతున్న అద్భుతమైన సినిమా. ఇందులో సోషల్ సమస్య కూడా వుంది. రామ్ చరణ్, కిరణా అద్వానీ, ఎస్.జె. సూర్య తదితరులు నటించారు. జనవరి 10న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.
 
ఆదిత్య రామ్ నా ఫ్రెండ్. ఆయనతో గతంలో సినిమాలు చేశాను. ఆ తర్వాత చెన్నైలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఎస్.వి.ఎస్, బేనర్, ఆదిత్యరామ్ బేనర్ తో కలిసి తెలుగు, తమిళ సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం అన్నారు.
 
ఆదిత్యరామ్ మాట్లాడుతూ, చాలా కాలం సినిమా రంగానికి దూరంగా వుండి రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడ్డాను. ఇప్పుడు మరలా సినిమాలు నిర్మించాలని నిర్ణయించారు. దిల్ రాజు గారితో కలిసి చేయానుకోవడం ఆనందంగా వుంది. మంచి కథలు వింటున్నాం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు.