సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (13:55 IST)

సంక్రాంతి సినిమాల విడుదలపై క్లారిటీ.. వెంకీ చిత్రం రిలీజ్ లేనట్టేనా?

venkatesh anil ravipudi
వచ్చే యేడాది సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాలపై ఓ క్లారిటీ వచ్చింది. రామ్‌‍చరణ్ "గేమ్ ఛేజర్", నందమూరి బాలకృష్ణ 109వ చిత్రం విడుదలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా పొంగల్ టార్గెట్‌గా చిత్రీకరణ జరుపుకుంటుంది వెంకీ - అనీల్ రావిపూడిల చిత్రం. ఈ సినిమాకు కూడా దిల్ రాజు నిర్మాతే కావటంతో, "గేమ్ ఛేంజర్‌"తో పాటు విడుదల ఉంటుందా అనే అనుమానం అందరిలోనూ నెలకొంది.
 
నిర్మాత దిల్ రాజు కూడా తన ఫస్ట్ ప్రియారిటీ "గేమ్ ఛేంజర్" విడుదలకే‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో వెంకీ అనీల్ రావిపూడి చిత్రం విడుదలను దిల్ రాజు వెనక్కి జరుపుతారనే వార్తలు వచ్చాయి. అయితే తన సినిమా వెనక్కి జరపటం అనే విషయంపై హీరో వెంకటేష్ అసహానాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
 
ఓపెనింగ్ రోజే తమ‌ సినిమా విడుదలను సంక్రాంతికే అని ప్రకటించించటంతో పాటు ఈ సినిమా టైటిల్ కూడా "సంక్రాంతి‌కి వస్తున్నామ్" అని ఉంటుందని ప్రచారం జరిగింది. గతేడాది సంక్రాంతి వచ్చిన తన 75వ చిత్రం "సైంథవ్" ఫలితం నిరాశపరచటంతో వెంకటేష్ మరలా హిట్ కొట్టి ఫామ్‌లోకి రావాలని ఛాలెజింగ్‌గా తీసుకుని అనీల్ రావిపూడి సినిమా కోసం వర్క్ చేస్తున్నారు.
 
అలాంటిది ఉన్నట్టుండి "గేమ్ ఛేజంర్" కోసం తన సినిమా విడుదలను వెనక్కి జరపటం అనే విషయంపై వెంకటేష్ సుముఖంగా లేరట.
ఈ సినిమా చిత్రీకరణ కూడా నాన్ స్టాప్‌గా జరుగుతోంది.‌ నిజానికి సంక్రాంతి కి మూడు సినిమాల విడుదల కు స్కోప్ ఉంటుంది కాబట్టి, దిల్ రాజు అనుకున్నట్లుగానే సంక్రాంతి బరిలో వెంకటేష్ సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారని‌ సమాచారం. 
 
దీపావళికి ఈ సినిమాకు విడుదలకు సంబంధించిన అప్డెట్ రానుందని, గేమ్ ఛేంజర్ జనవరి 10, బాలకృష్ణ 109 చిత్రం జనవరి 12న, వెంకీ - అనీల్ రావిపూడిల చిత్రం జనవరి 14న విడుదల అవుతాయనే ప్రచారం ఇండస్ట్రీలో నడుస్తొంది. అయితే, ఏది ఏమైనా వెంకేటష్ చిత్రంపై ఓ క్లారిటీ రావాల్సివుంది.