గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2024 (10:32 IST)

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి చిత్రం పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి

Venkatesh
Venkatesh
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తయింది. 30+ రోజుల లెన్తీ షెడ్యూల్‌లో, మేకర్స్ లీడ్ యాక్టర్స్ పై, పాటలు, యాక్షన్ పార్ట్‌తో కూడిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
 
ఈ సందర్భంగా, సెట్‌లోని ఛీర్ ఫుల్ ఎట్మాస్ఫీయర్ చూపించే గ్లింప్స్ ద్వారా అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసారు. "a day without laughter is a day wasted.”" అనే చార్లీ చాప్లిన్ కోట్ సూచిస్తూ చుట్టూ చిరునవ్వులతో, నటీనటుల మధ్య ఆనందాన్ని , స్నేహాన్ని వీడియో ప్రజెంట్ చేసింది.
 
మేకింగ్ వీడియోలో, వెంకటేష్ సంప్రదాయ దుస్తులలో కళ్లద్దాలతో కనిపిస్తుండగా, ఐశ్వర్య రాజేష్, అతని భార్య భాగ్య పాత్రలో, క్లాసిక్ చీరను ధరించింది. మీనాక్షి చౌదరి,ఎక్స్ లవ్ మీనాక్షి పాత్రలో మోడరన్ అవాతర్ లో కనిపించింది.
 
మున్నార్ దగ్గర ఇంటర్వెల్ సీక్వెన్స్ చిత్రీకరించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ వీడియో అనేక ఆనందమైన క్షణాలను కలిగి ఉంది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని టీం చెప్పడంతో వీడియో ఎండ్ అవుతుంది  
 
దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా కి  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.  సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ కో -రైటర్స్. వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్.
 
నటీనటులు: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి