ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (17:49 IST)

The GOAT మూవీ చేయడానికి రాజమౌళి గారే స్ఫూర్తి : డైరెక్టర్ వెంకట్ ప్రభు

Venkat Prabhu, Sneha, Meenakshi Chaudhary, Laila and others
Venkat Prabhu, Sneha, Meenakshi Chaudhary, Laila and others
దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.  'The GOAT' సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో  గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
 
డైరెక్టర్ వెంకట్ ప్రభు మాట్లాడుతూ, విజయ్, ప్రశాంత్, ప్రభుదేవ,  జయరాం ఇలా ఎంతోమంది బిగ్ స్టార్స్ తో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. స్నేహ,లైలా, మీనాక్షి, యోగిబాబు, ప్రేమ్ జీ ఇలా హ్యుజ్ స్టార్ కాస్ట్ వున్న సినిమా ఇది.  ఏడాదిలో ఈ సినిమా చేశాం. ఇదే సినిమా హాలీవుడ్ లో చేస్తే చాలా టైం, బడ్జెట్ తీసుకుంటారు. ఇలా చేయడానికి రాజమౌళి గారే స్ఫూర్తి. ఆయనకి పెద్ద ఫ్యాన్. మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్ యూ. వారు ఈ సినిమాని రిలీజ్ చేయడం ఒక హానర్ గా భావిస్తున్నాను. సెప్టెంబర్ 5న సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి.  బాలయ్య గారు సినీ పరిశ్రమలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. ఆయనకి మనస్పూర్తిగా శుభాకాంక్షలు. జై బాలయ్య. తెలుగు ఇండస్ట్రీలో  'GOAT' బాలయ్య గారు' అన్నారు.      
 
నిర్మాత అర్చన కల్పాతి మాట్లాడుతూ, The GOAT సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. మ్యాగ్జిమం స్క్రీన్స్ లో రిలీజ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ తో కొలబరేట్ అవ్వడం ఆనందంగా వుంది. ఇది మా 25వ సినిమా.సెప్టెంబర్ 5న అందరూ థియేటర్స్ లో సినిమా ఎంజాయ్ చేయండి' అన్నారు.
 
యాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ, ఆడియన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. నిర్మాతలు చాలా గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మించారు. ఇంతమంది స్టార్స్ ని ఒక ఫ్రేంలో చూపించి మూవీ తీయడం అంత తేలిక కాదు. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్ కి ఒక ట్రీట్ లా వుంటుంది  అన్నారు.
 
హీరోయిన్ స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ శంకర్ రాజా, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి తదితరులు మాటాడారు.