శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (19:36 IST)

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

dil raju
శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన "గేమ్ ఛేంజర్‌"లో అన్ని కమర్షియల్ హంగులతో పాటు మంచి సామాజిక అంశం కూడా ఉందని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఆయన చెన్నైలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 
 
శంకర్ దర్శకత్వంలో వచ్చే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. 'ఆర్ఆర్ఆర్' మూవీతో రామ్ చరణ్ గ్లోబెల్ స్టార్‌గా మారిపోయారు. వీరిద్దరి కాంబినేషనులో వస్తున్న ఈ చిత్రంలో ఒక మంచి సామాజిక అంశంతో పాటు భారీ కమర్షియ‌ల్ హంగులు ఉన్నాయి. ఆదిత్యరామ్ గతంలో తెలుగులో పలు చిత్రాలు నిర్మించారు. 
 
ఆ తర్వాత చెన్నైకు వచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడ్డారు. ఇపుడు 'గేమ్ ఛేంజర్ కోసం చేతులు కలిపారు. 'వారిసు' చిత్రం తర్వాత తమిళంలో చిత్రాలు తీయాలని నిర్ణయించుకున్నా. ఇకపై ఎస్వీసీ ఆదిత్యరామ్ బ్యానరుపై తమిళ చిత్రాలు నిర్మిస్తాను' అని పేర్కొన్నారు.
 
'ఈ నెల 9వ తేదీన లక్నో వేదికగా 'గేమ్ ఛేంజర్' టీజర్ను రిలీజ్ చేస్తున్నాం. ఆ తర్వాత అమెరికాలోని డల్లాస్, చెన్నై, జనవరి మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించి, జనవరి 10న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు.