గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (11:00 IST)

అమరావతి టూరింగ్ టాకీస్ పై విశ్వ కార్తికేయ కొత్త చిత్రం

Vishwa Karthikeya, Ayushi Patel clap by Suman
Vishwa Karthikeya, Ayushi Patel clap by Suman
కలియుగం పట్ణణంలో సినిమాతో విశ్వ కార్తికేయ నటుడిగా మరో మెట్టు ఎక్కారు. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా మరో చిత్రం రాబోతోంది. దసరా సందర్భంగా ఈ కొత్త మూవీని ప్రారంభించారు. అమరావతి టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై విశ్వ కార్తికేయ ఏడో చిత్రం రాబోతోంది. ముహూర్తం సన్నివేశానికి ముఖ్య అతిథులు హీరో సుమన్ క్లాప్ కొట్టారు.

సీనియర్ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ చంద్ర మహేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా  సీనియర్ దర్శకులు సముద్ర, సి.ఎల్. శ్రీనివాస్ గారు, కోటిబాబు గారు స్క్రిప్ట్‌ను అందించారు. మిగిలిన వివరాలను చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.
 
ఈ చిత్రానికి పోలాకి విజయ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. యెలేందర్ మహావీర్ సంగీతాన్ని అందించనుండగా.. కిషోర్ బోయిడపు కెమెరామెన్‌గా పని చేయనున్నారు. తారక్ (ఎన్టీఆర్) ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.