గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2024 (19:44 IST)

రాజకీయాల్లోకి రమ్మంటారా? హీరో సాయి దుర్గ తేజ్ కామెంట్స్..

sai durgha tej
మెగా ఫ్యామిలీ ముద్దుల మేనల్లుడు, సినీ హీరో సాయి దుర్గ తేజ్ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావాలంటే అనేక అంశాలపై అవగాహన కలిగివుండాలన్నారు. ఇప్పటికైతే తన దృష్టంతా కేవలం సినిమాలపైనే ఉందన్నారు. అదేసమయంలో రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదని చెప్పారు. 
 
ఆయన శుక్రవారం రాజకీయ ప్రవేశంపై స్పందిస్తూ, ప్రస్తుత రాజకీయాల్లోకి అడుగుపెట్టాలంటే ఎన్నో విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇప్పుడు తన దృష్టంతా సినిమాలపైనే ఉందని.. మరెన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించాలని, ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. 
 
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని, దానికి ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇక తనకు పునర్జన్మ లభించిందని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, తన ప్రాణాలను కాపాడింది కూడా హెల్మెట్టేనని గుర్తుచేశారు.