బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (17:59 IST)

రాజకీయాల్లోకి ఉపాసన.. విజయ్ అరంగేట్రం గురించి ఏమన్నారంటే?

Upasana
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన తాజాగా విజయ్ రాజకీయ ప్రవేశంపై స్పందించారు. నటుడిగా విజయ్ ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడని ప్రశంసల వర్షం కురిపించింది. 
 
ప్రస్తుతం విజయ్ ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారని ఉపాసన అన్నారు.  ఇంకా విజయ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమిళనాడుకు కొత్త మార్పు అవసరమని, మంచి విషయాలు జరుగుతాయని తాను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. 
 
మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఉపాసన స్పందిస్తూ.. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే సమాజంలో మార్పు తీసుకొచ్చే నాయకుడికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఉపాసన వెల్లడించారు.