గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (17:21 IST)

రామ్ చరణ్, బుచ్చిబాబు సాన ఫిల్మ్ RC16 - టాలెంట్ హంట్ కోసం ఉత్తరాంధ్ర రాబోతున్న టీం

RC 16 talent hunt
RC 16 talent hunt
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి పాన్ ఇండియా చిత్రం- #RC16 కోసం 'ఉప్పెన'తో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన యంగ్ ట్యాలెంటెడ్ దర్శకుడు బుచ్చి బాబు సానతో జతకట్టనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌, భారీ స్థాయిలో వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు.
 
అద్భుతమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రానికి ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో డైలాగ్‌లను అనర్గళంగా చెప్పగల నటీనటులు అవసరం. అందుకే ఉత్తరాంధ్రలో టాలెంట్ హంట్ కోసం ఆర్సీ16 టీమ్ వస్తోంది. ఔత్సాహిక నటీనటులందరినీ సిద్ధంగా ఉండమని వారు కోరుతున్నారు. ఫిబ్రవరి నెలలో విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆడిషన్స్ జరుగుతాయి. దాదాపు 400 మంది వివిధ వయసుల నటీనటులు ఈ సినిమా కోసం కాస్ట్ చేయనున్నారు.
 
బుచ్చిబాబు యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు మేకర్స్.