గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 జనవరి 2024 (11:49 IST)

కనిపించే దేవతకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

Chiranjeevi, anjana devi birhtday
Chiranjeevi, anjana devi birhtday
మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనా దేవి పుట్టినరోజును ఈరోజు తన గ్రుహంలో జరుపుకున్నారు; ఆమెను 'కనిపించే దేవత' కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు అని  సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసుకున్నారు. చిరంజీవి సోదరీమణులు, పిల్లలు హాజరై కనువిందు చేశారు. తన కొడుకు ప్రేమకు ముగ్థురాలై కోడలి సురేఖ కు కేక్ తినిపించారు అంజనాదేవి. ఈ ఫొటోలు అభిమానులో ఆనందాన్నినింపుతున్నాయి.
 
Chiranjeevi, anjana devi birhtday
Chiranjeevi, anjana devi birhtday
ఈ ఏడాది చిరంజీవి ప్రత్యేకమై ఏడాదిగా పేర్కొన్నారు.  45 సంవత్సరాలకు పైగా పరిశ్రమలో భాగమైన నటుడు, అతని కళాత్మక  మానవతా సహకారాల కారణంగా ఇటీవల పద్మ విభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మార్చిలో అవార్డు అందుకోనున్నారు. మరోవైపు తాజాగా విశ్వంభర సినిమా షూట్ లో పాల్గొనడం ఈ సినిమా పాన్ వరల్డ్ లో తీసుకువెళ్ళే ప్రయత్నం చేయడం మరింత ఆనందాన్నిచ్చిందని తెలిపారు.
 
anjana devi cake to surekha
anjana devi cake to surekha
ఇటీవలే చిరంజీవిని అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి ప్రముఖులు కూడా అభినందించడానికి వ్యక్తిగతంగా కలుసుకున్నారు.