శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2024 (16:38 IST)

యాక్షన్ సన్నివేశాల్లో గేమ్‌ ఛేంజర్ లేటెస్ట్ అప్ డేట్

Ram Charan, S.J. Surya
Ram Charan, S.J. Surya
శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. ఏడాదిన్నర పైగా ఈ చిత్రం ప్రారంభమైంది. తాజాగా హైదరాబాద్ శివార్లో ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను తమిళ ఫైట్ మాస్టర్ల ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. రామ్ చరణ్, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, జయరామ్ తదితరులు పాల్గొన్న ఈ సన్నివేశాలను శనివారంనాడు చిత్రీకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
ఇప్పటికీ దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సమకాలీన రాజకీయ నేపథ్యంలో ఈ చిత్ర కథను శంకర్ రాసుకున్నాడు. అపరిచితుడు, భారతీయుడు తరహాలో సామాజిక అంశం అందరికీ కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది.

ఈరోజు చిత్రయూనిట్ లో జూనియర్ ఆర్టిస్టుకు పుట్టినరోజు కేక్ కు కట్ చేసి పదివేల రూపాయలు ఆయనకు శంకర్ అందజేశారు. తన చిత్రాలన్నింటిలోనూ అతని పాత్ర వుంటుందని చెన్నైలో వున్నాహైదరాబాద్ నుంచి వచ్చి ఆశీర్వాదం తీసుకునేవాడని ఈ సందర్భంగా శంకర్ చెప్పడం విశేషం.