ఆదివారం, 19 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 జనవరి 2024 (11:24 IST)

మహా శివరాత్రికి గోపీచంద్ భీమా విడుదలకు సిద్ధం

gopi- bheema
గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా' ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇటీవల మేకర్స్ ఫస్ట్ ఆఫర్‌ను లాంచ్ చేయడంతో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ ఆఫర్‌ వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. గోపీచంద్ రూత్ లెస్ పోలీసుగా కనిపించారు. ఫస్ట్ ఆఫర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష తెలుగులోకి పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
తాజాగా మేకర్స్ గోపీచంద్ సరికొత్త పోస్టర్‌తో సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. పోస్టర్ లో పోలీసు అవతార్‌లో ఫెరోషియస్ గా కనిపించారు గోపీచంద్. భీమా మహా శివరాత్రికి మార్చి 8న థియేటర్లలోకి రానుంది. పండుగ సెలవులు కలిసిరాబోతున్న మాస్ సినిమాకి ఇది పర్ఫెక్ట్ డేట్.
 
ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
 
రమణ వంక ప్రొడక్షన్ డిజైన్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్ కాగా, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ ఫైట్స్ ని కొరియోగ్రఫీ చేస్తున్నారు
 తారాగణం: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ