గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (13:33 IST)

రామ్ చరణ్ రికార్డ్ ను బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Instagram
Vijay Deverakonda Instagram
విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇటీవలే రామ్ చరణ్ 20 మిలియన్ మార్క్ ని చేరుకున్నారు. 20 మిలియన్ మార్క్ ఫాలోవర్స్ ను అత్యంత వేగంగా చేరుకున్న దక్షిణ భారతదేశంలోని మొదటి నటుడిగా రామ్ చరణ్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు 21 మిలియన్ల ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ను విజయ్ దేవరకొండ చేరుకోవడం విశేషం.
 
కాగా, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల కంటే ఎక్కువగా 30 మిలియన్ల ఫాలోవర్స్ ను సమంత చేరింది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ 24.2 మిలియన్ల ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో నిలిచారు. అయితే వారంతా పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేసి పేరు తెచ్చుకుంటే కేవలం తెలుగు సినిమా గీతగోవిందంతో ఒక్కసారిగా హైలైట్ అయిన విజయ దేవరకొండ లైగర్ తో ప్లాప్ తెచ్చుకున్నా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
 
సమంతతో ఖుషి చేశాక, తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. త్వరలో అది విడుదల కాబోతుంది. ఆ తర్వాత మరో సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో విజయ్ చేయనున్నాడు. ఇప్పటికే పలు యాడ్ ఫిలింస్ లో పాల్గొన్న విజయ్ కు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ వుంది.