శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (12:02 IST)

మాకు పిల్లలు ఎందుకు ఆలస్యంగా పుట్టారంటే ... : ఉపాసన వివరణ

Ramcharan, upasana with baby
హీరో రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు పిల్లలు ఆలస్యంగా జన్మించారు. నిజానికి ఉపాసనకు బిడ్డలు పుట్టకపోవచ్చనే ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ క్రమంలోనే ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. ప్రస్తుతం వీరి ముద్దుల కుమార్తెకు క్లీంకార అని పేరు పెట్టుకున్నారు. అయితే, తమకు పిల్లలు ఆలస్యంగా పుట్టడానికి గల కారణాలను ఆమె తాజాగా వివరించారు. 
 
అమ్మ కావడాన్ని అందరూ గ్రేట్ అనుకుంటారు. తాను మాత్రం డబుల్ గ్రేట్ అని అనుకుంటానని చెప్పారు. తమకు పిల్లలు పుట్టడం లేట్ కావడంతో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. నిజానికి పిల్లల్ని కనడానికి పూర్తి సన్నద్ధం అయిన తర్వాతే కనాలని తాను, రామ్ చరణ్ అనుకున్నామని తెలిపారు. అందుకే తల్లిదండ్రులు కావడానికి సమయం తీసుకున్నామని చెప్పారు. 
 
వ్యక్తిగతంగా తాను, చరణ్ ఎంతో సన్నిహితంగా ఉంటామని చెప్పారు. కానీ, వృత్తిపరమైన విషయాల్లో ఎవరి సరిహద్దుల్లో వారు ఉంటూ ఒకరి విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోమని తెలిపారు. అలాగే, ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం, విలువ ఇచ్చిపుచ్చుకుంటామని వెల్లడించారు. 
 
అలాగే, మంచి దర్శకుడు కంటపడితే తన తాత, అపోలో ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి బయోగ్రఫీని సినిమాగా తీస్తానని తెలిపారు. మా తాత కథను వెండితెరపై అద్భుతంగా చెప్పగలిగే దర్శకుడు కావాలని చెప్పారు. మేమంతా మా రంగాల్లో రాణించడానికి ప్రధాన కారణం మా తాత స్ఫూర్తేనని చెప్పారు.