సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (08:28 IST)

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

SS Rajamouli, Surya
SS Rajamouli, Surya
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.

'కంగువ' సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.  ఈ రోజు 'కంగువ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. 
 
డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ - తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా మిగతా ప్రాంతాలకు తీసుకెళ్లాలని నాకు ఇన్సిపిరేషన్ కల్గించిన హీరో సూర్య. గజినీ టైమ్ లో సూర్య తన సినిమాలను తెలుగులో ప్రమోట్ చేసుకోవడం, తెలుగు ప్రేక్షకుల దగ్గరకు చేర్చడానికి చేసిన ప్రయత్నాన్ని కేస్ స్టడీగా నా ప్రొడ్యూసర్స్, హీరోలకు చెబుతుండేవాడిని. తెలుగు ప్రజల ప్రేమను సూర్య ఎలా పొందాడో, మనం కూడా తమిళ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజల ప్రేమను పొందాలని చెబుతుండేవాడిని. నేను పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది సూర్యనే. సూర్య నేను గతంలో ఓ సినిమా చేయాలనుకున్నాం. కుదరలేదు. 
 
సూర్య ఒక ఫంక్షన్ లో చెప్పాడు అతను నాతో సినిమా చేయడాన్ని మిస్ అయ్యానని, కానీ సూర్యతో సినిమా చేసే అవకాశం నేను మిస్ అయ్యాను. సూర్య నటన, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం. సూర్య ఫిలింమేకర్స్ కంటే స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుని జర్నీ చేస్తున్నాడు. అతని డెసిషన్ ను గౌరవిస్తాను. ఒక సినిమాను గొప్ప లొకేషన్ కు వెళ్లి షూట్ చేయడం కష్టం. క్రూ అంతా అక్కడికి తీసుకెళ్లాలి. పెద్ద స్టూడియోలో షూటింగ్ చేయడం కూడా కష్టమే. కానీ కంగువ సినిమాను చాలా రేర్ లొకేషన్స్ లో సెట్స్ వేసి మరీ షూట్ చేశారు. మీరు పడిన కష్టం మేకింగ్ వీడియోలో తెలుస్తోంది. మీ టీమ్ కష్టమంతా సినిమా రిలీజ్ అయ్యాక విజయం రూపంలో ప్రతిఫలంగా దక్కుతుందని నమ్ముతున్నాను. కంగువ లాంటి సినిమాను థియేటర్స్ లోనే చూడాలి. అప్పుడే ఆ సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ పొందుతారు.  ఈనెల 14న కంగువను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
 
హీరో సూర్య మాట్లాడుతూ - రాజమౌళి గారు మా అందరికీ ఒక గొప్ప దారి చూపించారు. మేము ఆ దారిలో ప్రయాణిస్తున్నాం. రాజమౌళి గారి ఏ సినిమాతో మా కంగువను పోల్చలేము. ఆయనను ఆయన సినిమాలను చూసి ఇన్స్ పైర్ అవుతుంటాం. నేను ఒకసారి రాజమౌళి గారితో సినిమా చేసే అవకాశం మిస్ చేసుకున్నాను. కానీ ఇప్పటికీ ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నాను. మన కుటుంబంలో పెద్ద అన్న సక్సెస్ అయితే మిగతా వారికి ఆ స్ఫూర్తి అందుతుంది.

అలా రాజమౌళి గారు సాధించిన విజయాలతో మేము స్ఫూర్తి పొందాం.  జ్ఞానవేల్ రాజా ఫోన్ లో రాజమౌళి గారి ఫొటో స్క్రీన్ సేవర్ గా ఉంటుంది. ఆయనకు రాజమౌళి గారి బ్లెస్సింగ్స్ ఉండాలి. నా దర్శక నిర్మాతలు, అభిమానులు, సినిమాను ప్రేమించే ప్రేక్షకుల వల్లే ఈ వేదిక మీద ఉండగలిగాను. కంగువ నాకు మర్చిపోలేని అనుభూతి ఇచ్చిన సినిమా. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డా. నా స్నేహితులు ప్రభాస్, రానా, అనుష్కను బాహుబలి గురించి మాట్లాడేప్పుడు రెండేళ్లు ఎలా డేట్స్ ఇచ్చారని అడిగేవాడిని. ప్రతిరోజూ ఎగ్జైటింగ్ గా వర్క్ చేశాం. రాజమౌళి గారి వల్ల ఆ ఎంకరేజ్ మెంట్ వచ్చేది అని చెప్పారు. కంగువ సెట్ లో శివ వర్క్ చూసి నాకూ అలాంటి ఎంకరేజ్ మెంట్ దక్కింది.

ప్రతిరోజూ మూడు వేల మంది సెట్ లో పనిచేసేవారు. ముగ్గురు నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్స్ తో శివ వీళ్లందరితో వర్క్ చేయించుకునేవారు. కంగువలో నటించాక నేను వ్యక్తిగతంగా మరింత పరిణితి చెందాను. కంగువ వంటి స్పెషల్ మూవీ మాకు ఇచ్చినందుకు శివకు థ్యాంక్స్ చెబుతున్నా. ఇది ఎవర్ గ్రీన్ సినిమాగా మీ మనసుల్లో నిలిచిపోతుందని నమ్ముతున్నాను. కంగువలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉన్నాయి. ఈ నెల 14న థియేటర్స్ లో మరో దీపావళిని సెలబ్రేట్ చేసుకుందాం. మీ ఆశీస్సులు, ప్రేమ ఎల్లప్పుడూ కావాలి. అన్నారు.