బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (12:36 IST)

కంగువ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్నుమూత.. ఆ ఫోటో వైరల్

Nishad Yusuf
Nishad Yusuf
ప్రఖ్యాత ఫిల్మ్ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ తన 43వ ఏట బుధవారం కన్నుమూశారు. కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌లో ప్రాణాలు కోల్పోయారని సన్నిహితులు ధ్రువీకరించారు. యూసుఫ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాపులర్ వ్యక్తి. అసాధారణమైన ఎడిటింగ్ నైపుణ్యాలకు పేరుగాంచాడు. 
 
ఇటీవల సూర్య నటించిన "కంగువ" అనే భారీ అంచనాల చిత్రానికి పనిచేశాడు. 2022లో, అతను "తల్లుమాల" చిత్రంలో తన అద్భుతమైన పనికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ ఎడిటర్ అవార్డును అందుకున్నాడు. యూసుఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
కాగా నిషాద్ యూసుఫ్ ది ఆత్మహత్యేనా..? అసలు అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి.? అన్నది తెలియాల్సి ఉంది. కాగా కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సూర్య, బాబీ డియోల్‌తో నిషాద్ యూసుఫ్ దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.