1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rambha blessed with a baby boy

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సినీ నటి రంభ

టాలీవుడ్ - కోలీవుడ్‌లను ఓ ఊపు ఊపిన నటి రంభ. ఓ ప్రవాస భారతీయ వ్యాపారిని ఆమె 2010లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విదేశాల్లో స్థిరపడిపోయారు. సినీ ఇండస్ట్రీకి స్వస్తి చెప్పింది.

Rambha
టాలీవుడ్ - కోలీవుడ్‌లను ఓ ఊపు ఊపిన నటి రంభ. ఓ ప్రవాస భారతీయ వ్యాపారిని ఆమె 2010లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విదేశాల్లో స్థిరపడిపోయారు. సినీ ఇండస్ట్రీకి స్వస్తి చెప్పింది. ఈ నేపథ్యంలో రంభ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఇపుడు ముచ్చటగా మూడో బిడ్డగా మగబిడ్డకు జన్మనిచ్చింది.
 
కెనడా టొరంటోలో ఈ నెల 23వ తేదీన రంభ బాబుకు జన్మనిచ్చారనీ, రెండ్రోజుల క్రితం తమకు మగశిశువు జన్మించారంటూ రంభ భర్త ఇంద్రకుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో రంభకు సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు, ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రాంచ‌ర‌ణ్ - బోయ‌పాటి మూవీ టైటిల్ ఇదేనా..?