సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (20:48 IST)

రాంచ‌ర‌ణ్ - బోయ‌పాటి మూవీ టైటిల్ ఇదేనా..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న భ‌ర‌త్ అనే నేను ఫేమ్ కైరా అద్వానీ న‌టిస్తోంది. డి.వి.వి. ఎంట‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న భ‌ర‌త్ అనే నేను ఫేమ్ కైరా అద్వానీ న‌టిస్తోంది. డి.వి.వి. ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పైన డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ యూర‌ప్‌లోని అజ‌ర్ బైజాన్ అనే ప్ర‌దేశంలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్ష‌న్ సీన్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, విల‌న్ వివేక్ ఒబ‌రాయ్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్టు స‌మాచారం.
 
ఈ భారీ చిత్రంలో సీనియ‌ర్ హీరో ప్ర‌శాంత్, ఆర్య‌న్ రాజేష్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయి చాలా రోజులు అయ్యింది. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా ఈ సినిమాకి చిరంజీవి మూవీ టైటిల్ అయిన స్టేట్ రౌడీ అనే టైటిల్ పెట్టాల‌నుకుంటున్నార‌ని తెలిసింది. 
 
ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 19న ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి డేట్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. మూవీని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. ద‌స‌రా రోజున ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.