శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 జులై 2018 (18:44 IST)

సితార పుట్టినరోజు.. ప్రిన్స్ స్పెషల్ కేక్.. చెర్రీ విషెస్ వీడియో..

ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతల చిట్టితల్లి సితారకు శుక్రవారం పుట్టినరోజు. సితారకు అప్పుడే ఆరేళ్లు అయిపోయాయి. ఆరేళ్లు నిండి ఏడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, సితార పుట్టిన రోజు వేడుకలను ఓ స్టార్ హోటల్‌

ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతల చిట్టితల్లి సితారకు శుక్రవారం పుట్టినరోజు. సితారకు అప్పుడే ఆరేళ్లు అయిపోయాయి. ఆరేళ్లు నిండి ఏడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, సితార పుట్టిన రోజు వేడుకలను ఓ స్టార్ హోటల్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు మహేష్ బాబు. ఇందుకోసం తమ ఫ్యామిలీ ఫొటోతో తయారైన కేక్‌ను ప్రత్యేకంగా చేయించాడు. తన లిటిల్ ప్రిన్సెస్ సితార ఆరో పుట్టిన రోజు వేడుకలంటూ కొన్ని ఫొటోలను మహేష్ బాబు అభిమానులతో పంచుకున్నారు. 
 
మరోవైపు సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే సెలెబ్రిటీల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రిన్స్‌కు స్నేహితుడైన, మెగా హీరో రామ్ చరణ్.. సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సితార హాయ్ అంటూ.. ఎలావున్నావు.. హ్యాపీ బర్త్ డే. లవ్లీ బర్త్‌డేను సెలెబ్రేట్ చేయమంటూనే, తనకోసం ఓ పాటను పాడాలని.. మళ్లీ కలిసేటప్పుడు తన కోసం ఓ పాట పాడాలని.. మరిచిపోకూడదంటూ చెర్రీ వీడియో రూపంలో సితారను కోరాడు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.