1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ramya Krishnan replace Kamal Haasan as 'Bigg Boss' host

తమిళ బిగ్ బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ - తెలుగులో వీకెండ్ హోస్ట్?

Ramya Krishnan
విశ్వనటుడు కమల్ హాసన్ కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన హోస్ట్‌గా టెలికాస్ట్ అవుతున్న తమిళ బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్ట్‌గా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర హీరోయిన్ రమ్యకృష్ణను ఎంపిక చేశారు. ఈమె హోస్ట్‌గా చేసిన ఎపిసోడ్ శనివారం రాత్రి ప్రసారంకానుంది. ఈమెకు గతంలో బిగ్ బాస్ షోను నడిపించిను అనుభవం ఉండటంతో ఆమెను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. 
 
మరోవైపు, తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోకు కూడా ఆమెను వీకెండ్ హోస్ట్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈషోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో అక్కినేని నాగార్జున తన పుట్టిన రోజును పురస్కరించుకుని విహార యాత్రకు వెళ్లారు. దీంతో రమ్యకృష్ణ వీకెండ్ హోస్ట్‌గా అవతారమెత్తారు. ఇటు తెలుగు, అటు తమిళంలో వీకెండ్ హోస్ట్‌గా రమ్యకృష్ణ ఆలరించనున్నారు. కాగా, ప్రస్తుతం నాగార్జునతో కలిసి రమ్యకృష్ణ బంగార్రాజు అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
బిగ్ బాస్ లో పాల్గొంటే అంత డ‌బ్బు వ‌స్తుందా!