సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (11:35 IST)

విశ్వనటుడు కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి ఏంటి?

విశ్వ నటుడు కమల్ హాసన్ కరోనా వైరస్ బారినపడి చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈయన ఆరోగ్యంపై ఆ ఆస్పత్రి వైద్యులు ఒక అధికారిక వైద్య బులిటెన్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పేర్కొన్నారు. 
 
ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చిన కమల్ హాసన్‌లో కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఇందులో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన ఆరోగ్యంపై విడుదల చేసిన వైద్య బులిటెన్‌లో కమల్ హాసన్ బాగా కోలుకుంటున్నారనీ, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, ఆయన ఆరోగ్యంపై ప్రతి 24 గంటలకు ఒకసారి వైద్య బులిటెన్‌ను రిలీజ్ చేస్తున్నారు.