సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (17:50 IST)

కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్... తమిళ బిగ్ బాస్ సంగతేంటి?

స్టార్ హీరో కమల్ హాసన్ ఆస్పత్రిలో చేరారు. ఆయన కరోనా పాజిటివ్ నిర్ధారణ  అయ్యింది. దీంతో బిగ్ బాస్ తమిళ్ సీజన్ 5ని ఎవరు హోస్ట్ చేస్తారనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

కమల్ హాసన్ హాసన్ రెండు వారాల క్రితం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా, అతని రాబోయే చిత్రం విక్రమ్ ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా కమల్ హాసన్ అభిమానులు సందేశాన్ని పంపారు.
 
గత వారం నుంచి టచ్ లో ఉన్నవారు వెంటనే కరోనా పరీక్షలు చేసుకొని క్వారంటైన్‌లోకి వెళ్లాలని వీలైనంత వరకు సేఫ్‌గా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇక కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. మాస్క్ ధరించడమే కాకుండా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని వివరణ ఇచ్చారు. 
 
ఇక కమల్ హాసన్ తనకు కరోనా వచ్చింది అని చెప్పగానే అభిమానులు కొంత ఆందోళన చెందారు. ఇక ప్రస్తుతం తన పరిస్థితి మెరుగ్గానే ఉందని కమల్ హాసన్ చెప్పడంతో త్వరగా కోలుకోండి.. అంటూ ఫ్యాన్స్ అందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.