శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (17:53 IST)

నిలకడంగా కమల్ హాసన్ ఆరోగ్యం - వైద్య బులిటెన్

కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందున్న మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ ఆరోగ్యం నిలకడగా వుంది. ఈ మేరకు ఆయన చికిత్స పొందుతున్న శ్రీ రామచంద్రా మెడికల్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుహాస్ ప్రభాకర్ పేరుతో బుధవారం ఒక వైద్య బులిటెన్ విడుదలైంది. కమల్‌కు ఐసోలేషన్ వార్డులో శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుంది, శరీరంలోని అన్ని వ్యవస్థలు సజావుగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే, రక్తపోటు, చక్కెర స్థాయి నిల్వలు అన్నీ అదుపులో ఉన్నట్టు తెలిపారు. కాగా, ఇటీవల అమెరికాకు వెళ్లొచ్చిన కమల్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలిన విషయం తెల్సిందే.