ఇండియన్ ఉమెన్స్ హెల్త్ రిపోర్ట్ 2021 అధ్యయనాన్ని భారతదేశ వ్యాప్తంగా ఏడు నగరాలలో 25-55 సంవత్సరాల నడుమ వయసు కలిగి వివిధ సంస్థలలో ఉద్యోగులుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 1000 మంది మహిళలపై నిర్వహించారు. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, దాదాపు సగం మందికి పైగా మహిళలు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మహిళల ఆరోగ్య సమస్యలను గురించి మాట్లాడటాన్ని సౌకర్యంగా భావించలేదు. దీనికి సామాజిక అపోహలు మరియు ఆ సమస్యలతో కలిసి ఉన్న భయాలే కారణమని ఈ అధ్యయనం వెల్లడించింది.
ఈ అధ్యయనాన్ని ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఇప్సోస్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇప్సోస్ ఇండియా)తో భాగస్వామ్యం చేసుకుని నిర్వహించింది. సామాజిక, సాంస్కృతిక, వైద్య పరమైన అంశాల పరంగా వర్కింగ్ ఉమెన్ ఆలోచనలు తెలుసుకోవడంతో పాటుగా వారి సమస్యలకు తగిన పరిష్కారాలను సైతం కనుగొనాలనే లక్ష్యంతో ఈ అధ్యయనం చేశారు.
ఈ అధ్యయనం ద్వారా, వైట్ కాలర్ ఉద్యోగాలలో ఉన్న మహిళలు, ఆరోగ్య పరంగా తాము ఎదుర్కొంటున్న నిందలను గురించి తెలుపడంతో పాటుగా అది ఏ విధంగా సామాజిక ఒత్తిడి, ప్రొషెషనల్ సమస్యలకు కారణమవుతుందో వెల్లడించారు.
అధ్యయనంలో కనుగొన్న కీలకాంశాలు
కుటుంబ/వ్యక్తిగత మరియు ప్రొషెషనల్ బాధ్యతలను సమతూకం చేయడంలో సంఘర్షణ.
హైదరాబాద్‌కు సంబంధించి నిర్థిష్టమైన అధ్యయన ఫలితాలు.
కుటుంబ/వ్యక్తిగత మరియు వృత్తిపరమైన బాధ్యతలను సమతూకం చేసుకోవడంలో 81% మంది మహిళలు సంఘర్షణను ఎదుర్కొంటున్నారు.
కేవలం 43% మంది మహిళలు మాత్రమే ఆరోగ్యం మరియు పని నిర్వహించుకోవడం కష్టంగా భావిస్తున్నారు.
77% మంది మహిళలు ఉద్యోగాలను మానేయడం/తమ కెరీర్‌లకు విశ్రాంతి నివ్వడం గమనించామని వెల్లడించారు. ఆరోగ్య పరంగా అత్యంత సహజమైన కారణాలుగా పీసీఓఎస్, గర్భవతి కావడం, ఎండోమెట్రియోసిస్ (53%) చెబుతున్నారు.
71% మంది మహిళలు తమ పురుష సహోద్యోగులు మహిళల ఆరోగ్య సమస్యల పట్ల సున్నితత్త్వంతో ఉండటం లేదని వెల్లడిస్తున్నారు.
ఎక్కువగా వినిపించే మూస కామెంట్ 'ఆమెకు వివాహమైంది, త్వరలోనే ఆమె కెరీర్ ముగుస్తుంది'(53%)
83% మంది మహిళలు నెలసరి పరంగా మూసపద్ధతులు/తీర్పులను చూస్తున్నామంటున్నారు.
అతి సహజంగా వినిపించే మూస కామెంట్ 'దేవాలయం దగ్గరకు వెళ్లవద్దు, కిచెన్ మరియు ఇతర స్వచ్ఛతతో కూడిన ప్రాంగణాల వద్దకు వెళ్లవద్దు' (57%).
ఎదుర్కొంటున్నామని 90%మంది వర్కింగ్ ఉమెన్ వెల్లడిస్తున్నారు.
తమ సహోద్యోగులు/బంధువులు/స్నేహితులు ఉద్యోగాలను మానేయడం చూశామని 86% మంది వర్కింగ్ ఉమెన్ వెల్లడిస్తున్నారు. వీరిలో 59% మంది ఆరోగ్య సమస్యలే ప్రధానకారణమని చెబుతున్నారు.
84%మంది వర్కింగ్ ఉమెన్, బహిష్టు కాలంలో ప్రార్థనా మందిరాల వద్దకు వెళ్లవద్దని లేదా వంటగదిలోకి రావొద్దని లేదా తమ శానిటరీ న్యాప్‌కిన్‌లను దాయమని చెప్పడం వంటి మూసపద్ధతులు/తీర్పులను చూశామని వెల్లడించారు.
ఎండోమెట్రియోసిస్‌తో బాధపడే మహిళలు వివాహానికి అనర్హులని సమాజం భావిస్తుందని 66% మంది ఉద్యోగిణిలు భావిస్తున్నారు.
67% మంది ఉద్యోగిణిలు వెల్లడించే దాని ప్రకారం ఆరోగ్య సమస్యలను గురించి మాట్లాడటం ఇప్పటికీ సమాజంలో ఓ నిషిద్ధ అంశం.
ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం పీసీఓఎస్, రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియోసిస్ వంటి అంశాలను గురించి మాట్లాడటం ఇప్పటికీ నిషిద్ధ మరియు మూసపద్ధతుల్లోనే ఉంది. భారతదేశంలో మహిళల ఆరోగ్యం పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని ఇది వెల్లడిస్తుంది.
నమితా థాపర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ మాట్లాడుతూ, మేము మా యూట్యూబ్ టాక్ షో ప్రారంభించినప్పుడు, ఈ జనవరిలో మీరు మహిళల ఆరోగ్యం పట్ల మనసు విప్పి మాట్లాడమన్నప్పుడు, మహిళలు ఈ షోకు వచ్చి మాట్లాడటం ఎంత కష్టమో గుర్తించాము. ఇదే మమ్మల్ని ఈ అధ్యయనం చేసేందుకు పురిగొల్పడంతో పాటుగా ఈ అంశాల చుట్టూ అవగాహన, వ్యాధి నిర్ధారణ పట్ల మెరుగైన అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను ప్రారంభించేలా చేసింది.
కార్పోరేట్ రంగంలో పురోగతి సాధించినప్పటికీ, మహిళల ఆరోగ్య పరంగా సమస్యలు ఇప్పటికీ మూఢత్వంతో నిండి ఉన్నాయి. మా అధ్యయనంలో కనుగొన్న అంశాలు వెల్లడించే దాని ప్రకారం, భారతదేశంలో వైట్ కాలర్ ఉద్యోగాలు చేసే మహిళలపై కూడా మహిళల ఆరోగ్యంకు సంబంధించిన అంశాల పట్ల సామాజిక అపోహలు, అశాస్త్రీయమైన సామాజిక నిషేదాలు కొనసాగుతున్నాయి అని అన్నారు.
ఈ అధ్యయనంసూచించే దాని ప్రకారం, ఆరోగ్య సమస్యలతో పాటుగా పలు వృత్తిపరమైన మరియు సామాజిక మూసపద్ధతుల పట్ల కూడా మహిళలు ప్రభావితమవుతున్నారు. ప్రొఫెషనల్ ప్రదర్శన పరంగానూ ఈ అంశాలు వారిపై ప్రభావం చూపుతున్నాయి అని థాపర్ అన్నారు.
ఆమనే మరింతగా మాట్లాడుతూ అజ్ఞానం, అవగాహన లేమి మరియు ఆమోదం లేకపోవడం వంటి అంశాలు కేవలం ఈ అంశాలను మరింత జఠిలంగా మార్చడంతో పాటుగా వ్యాధి కనుగొనడం, దానికి తగిన పరిష్కారాలను అందించడం కూడా కష్ట సాధ్యంగా మారింది. బాధ్యతాయుతమైన సమాజంగా, ఈ అంశాలను అంగీకరించడంతో పాటుగా ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మహిళలు తమ గొంతు బలంగావినిపించడంతో పాటుగా ఈ అతి ముఖ్యమైన అంశాల పట్ల తరచుగా మాట్లాడాల్సి ఉంది అని అన్నారు.
ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, అధ్యయనంలో పాల్గొన్న దాదాపు సగం మంది ఉద్యోగిణిలు తాము లేదంటే తమకు తెలిసిన వారు సంతానలేమి సమస్యను ఎదుర్కొనడం రొమ్ము క్యాన్సర్, పీసీఓఎస్ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుందని చెబుతున్నారు కానీ ఆ ఆరోగ్య సమస్యలను చర్చించేందుకు ఇప్పటికీ వ్యతిరేకత కనబరుస్తున్నారు.
75%మంది ఉద్యోగిణిలు వెల్లడించే దాని ప్రకారం తమ ఎంప్లాయర్లు ఆరోగ్య సమస్యల పరిష్కారానికి పలు కార్యక్రమాలను చేపడుతున్నారని చెబుతున్నారు. ఈ అధ్యయనమే వెల్లడించే దాని ప్రకారం దాదాపు 80% మంది పురుష సహోద్యోగులు మహిళల ఆరోగ్య సంబంధిత ఆందోళనల పట్ల సున్నితంగా వ్యవహరించడం లేదు. అంతేకాదు, 52% మంది ఉద్యోగిణిలు తమ పని కారణంగా ఆరోగ్యం నిర్వహించుకోవడం కష్టంగా ఉందని వెల్లడిస్తున్నారు. ఇక పలు రంగాల పరంగా చూసుకుంటే రిటైల్ రంగంలో 67% మంది ఉద్యోగిణిలు ఈ అంశాన్ని వెల్లడిస్తున్నారు.
సామాజిక, సాంస్కృతిక, వైద్య పరమైన అంశాలపరంగా మహిళా ఉద్యోగిణిల దృక్పథంపై ఎమ్‌క్యూర్ ఫార్మాస్యూటికల్ యొక్క అధ్యయనాన్ని ఇప్సోస్ ఇండియా నిర్వహించింది. ఉద్యోగిణిలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను గురించిన సమాచారాన్ని ఇప్సోస్ ఇండియా సేకరించడంతో పాటుగా సామాజిక, కార్పోరేట్ ప్రపంచాలలో సంబంధం కలిగి ఉన్న అపోహలను గుర్తించింది. ఈ ఆన్‌లైన్ అధ్యయనంలో వైట్ కాలర్ ఉద్యోగాలలో ఉన్న 25-55 సంవత్సరాల వయసు కలిగిన 1000 మందికి పైగా మహిళా ఉద్యోగిణిలను ఇప్సోసోస్ ఇండియా అధ్యయనం చేసింది.