1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sampath Nandi Picks Anchor Anasuya

సంపత్ దర్శకత్వంలో అనసూయ.. (video)

Sampath Nandi
యంగ్ డైరెక్టర్ సంపత్ నెక్స్ట్ మూవీలో అనసూయ ప్రధాన పాత్రలో నటించనుంది అని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఆయన మరో సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తుందని అంటున్నారు. త్వరలో సంపత్ నంది, అనసూయ భరద్వాజ్ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన చేయడానికి సిద్ధమవుతున్నారట. 
 
ప్రస్తుతం అనసూయ మాస్ మహారాజా రవితేజ "ఖిలాడీ" చిత్రంలో అనసూయ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న "పుష్ప: ది రైజ్‌" అనే పాన్ ఇండియా సినిమాలో కూడా భాగమయ్యింది.
 
ఇప్పుడు సంపంత్ నంది నిర్మించబోయే ఫ్యామిలీ డ్రామాలో ప్రధాన పాత్రలో నటించడానికి రెడీ అవుతోంది. మరోవైపు సంపత్ నంది తన దర్శకత్వంలో రూపొందిన సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. 
 
సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన "సీటిమార్" స్పోర్ట్స్ డ్రామా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సంపత్ నంది ప్రస్తుతం బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రధాన పాత్రలో "బ్లాక్ రోజ్" అనే వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఇది ఇంకా రిలీజ్ కాలేదు.
 
తర్వాతి కథనం
సోనూసూద్ ఆస్తుల విలువెంత..?