బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (17:37 IST)

సోనూసూద్ ఆస్తుల విలువెంత..?

బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆస్తులపై ఐటీ శాఖ దాడులు చేయడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంటితో పాటు ముంబైలోని ఆయనకు చెందిన ఆఫీసులో కూడా తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ ఆస్తుల విలువెంత..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే కేవలం రూ.5500 తో ముంబైలో అడుగు పెట్టిన సోనూ.. ఇప్పుడు రూ.130 కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యాడు.
 
ప్రస్తుతం ముంబైలోనే భార్య, పిల్లలతో స్థిరపడిన సోనూ.. సినీ ఇండస్ట్రీలో బాగానే సంపాదించాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ చిత్రాలలో ప్రసిద్ధి చెందిన సోనూ.. ఒక్కో సినిమాకు రూ.2 కోట్లకు వరకు పుచ్చుకునేవాడు. అలాగే పలు బ్రాండ్స్‌కు ప్రచార కర్తగా వ్యవహరిస్తూ కొంత సొమ్మును సంపాదిస్తున్నాడు. మరోవైపు సోనూకు శక్తి సాగర్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. మొత్తం మీద సంవత్సరానికి సోనూ రూ.12 కోట్ల వరకు సంపాదిస్తున్నారు.