గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (17:29 IST)

రియల్ హీరో సోనూసూద్ నివాసాల్లో ఐటీ సోదాలు

కరోనా కష్టకాలంలో అనేక మందికి ఆపద్బాంధవుడుగా కనిపించిన రియల్ హీరో బాలీవుడ్ నటుడు సోనూసూద్. ప్రభుత్వాలు చేయలేని సాయం ఈయన చేశారు. అలాంటి సోనూసూద్‌పై ఇపుడు ఆదాయపన్ను శాఖ పగబట్టింది. ఆరు ప్రాంతాల్లో ఉన్న ఆయన నివాసాలపై ఏకకాలంలో సోదాలకు దిగింది. 
 
ఈ తనిఖీలు ముంబైలోని ఆయనకు చెందిన ఆఫీసులో కూడా చేపట్టారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం తెల్సిందే. 
 
అంతకుముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే ఐటీ శాఖను ఈ సోదాలకు కేంద్రం ఉసిగొల్పినట్టుగా ఉందనే విమర్శలువస్తున్నాయి. మరోవైపు, సోనూ సూద్‌ నివాసాల్లో ఐటీ అధికారులు ‘సర్వే’ చేశారనే వార్త సంచలనంగా మారింది.