మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (15:00 IST)

అంద‌రినీ కాపాడాల‌ని క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని కోరిన‌ సోనూసూద్‌

Sonusood-temple
దేశానికి తెలిసిన పేరు సోనూసూద్. త‌ను ఒక‌వైపు షూటింగ్ లు చేస్తూనే మ‌రోవైపు స‌మాజ సేవ చేస్తూనే వుంటున్నారు. క‌రోనా టైంలో ఆయ‌న చేసిన సేవ‌లు అంద‌రికీ తెలిసిందే. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్క‌డ ప్ర‌ముఖ ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తూనే వుంటారు.

Sonusood-temple
గురువారంనాడు సోనూసూద్ విజ‌య‌వాడ‌కు వెళ్ళారు. అక్క‌డ అంకుర ఆసుప‌త్రి నూత‌న బ్రాంచ్ ఏర్పాటుకు ఆయ‌న ఆహ్వానితులుగా హాజ‌ర‌య్యారు. ఇంత‌కు ముందు కూడా ఇటువంటి కార్య‌క్ర‌మానికి హాజ‌రై త‌న‌కు త‌గిన సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు.  క‌రోనా త‌ర్వాత ఆసుప‌త్రుల‌లో ఆక్సిజ‌న్ స్థాయిలు ఏమేరకు వున్నాయో ఆయ‌న తెలుసుకోవ‌డం విశేషం.
 
Sonusood-temple
ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వం అనంత‌రం ఆయ‌న విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌ద‌గ్గ‌మ్మ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఆయ‌న రాక తెలిసిన వంద‌లాది భ‌క్తులు ఆయ‌న‌తో ఫొటోలు దిగడానికి ఉత్సాహాన్ని చూపారు. అమ్మ‌వారి ఆల‌యంలోని ప్ర‌ధాన అర్చ‌కులు ఆయ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, అమ్మ‌వారి ఆశీస్సులు అంద‌రికీ వుండాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.