ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (09:53 IST)

కన్నకూతురిపైనే తండ్రి లైంగికదాడి.. ఎక్కడంటే?

వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కన్నకూతురిపైనే తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చినబాబు అనే వ్యక్తి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ, వికాస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పీడీగా పనిచేస్తున్నాడు. అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే తన ఐదేండ్ల కూతురిపై పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ చిన్నారికి ఈ మధ్య నొప్పి పెరగడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది.
 
దాంతో అసలు విషయం బయటపడింది. వెంటనే భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిశ పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.