బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:05 IST)

విజయవాడకు రానున్న సోనూసూద్, దుర్గమ్మను దర్శించుకుని...

సినీ నటుడు సోనూసూద్ షెడ్యూల్లో మార్పు జరిగింది. ఆయన ఒక రోజు ఆలస్యంగా గురువారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.
 
తన సేవా కార్యక్రమాలతో అత్యంత పాపులారిటీ, ఇమేజ్ సాధించిన సోనూ సూద్ ప్రస్తుతం హైద్రాబాద్ లోనే ఉన్నారు. సోనూసూద్ రేపు ఉదయం 7:30 గంటలకు హైద్రాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.

విజయవాడలో ఉదయం 9 గంటలకు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. సోనూసూద్
అనంతరం ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకోనున్నారు. సోనూసూద్ విజయవాడ పర్యటన కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.